Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ కు పవన్ కల్యాణ్ స్టయిల్లో వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

  • కేసీఆర్ పై ధ్వజం
  • తాటతీస్తానంటూ హెచ్చరిక
  • 1000 కోడికత్తులు వచ్చినా నన్నేమీ చేయలేరు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చివరిరోజున మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రచారం చరమాంకంలో జగన్, కేసీఆర్, మోదీలపై విమర్శల జడివాన కురిపిస్తున్న చంద్రబాబు ముఖ్యంగా కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తనను సన్నాసి అనడంపై సీరియస్ గా స్పందించిన ఆయన పవన్ కల్యాణ్ స్టయిల్లో వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా అంటూ హెచ్చరించారు. పవన్ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా తాటతీస్తా అని వాడుతుండడం తెలిసిందే.

"ఏం తమ్ముళ్లూ మీ ముఖ్యమంత్రి సన్నాసా? కేసీఆర్ గొప్ప నాయకుడా? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. నా జోలికి వస్తే తాటతీస్తాను తప్ప వదిలిపెట్టను. నీలాగా నేను నోటికి వచ్చినట్టు మాట్లాడను. నాకు హుందాతనం ఉంది. మీకు, నరేంద్ర మోదీకి బుద్ధి రావాలంటే మీ భాష వాడితే తప్ప మీకు బుద్ధి రాదు. 100 మంది మోదీలు నన్నేమీ చేయలేరు. 500 మంది కేసీఆర్ లు ఏమీ చేయలేరు. 1000 కోడికత్తులు కూడా ఏమీ చేయలేవు తమ్ముళ్లూ!" అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

 "వరుసగా వారం రోజులు పొగ వేస్తే ఈ కేసీఆర్ ఇప్పటికి  బయటికి వచ్చాడు తమ్ముళ్లూ! కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేకహోదాకు అభ్యంతరం లేదని చెబుతున్నాడు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే, అడ్డుతగిలింది ఈ కేసీఆరే" అంటూ మండిపడ్డారు. పార్లమెంటులో మీరు ఆ రోజు తీర్మానానికి ఓటెందుకు వేయలేదు? ఎందుకు సహకరించలేదు? అంటూ నిలదీశారు.
Chandrababu
KCR
Pawan Kalyan

More Telugu News